అక్కడ “పుష్ప” ని “కాంతారా” బీట్ చేసినా చెయ్యనట్టేనా.?

అక్కడ “పుష్ప” ని “కాంతారా” బీట్ చేసినా చెయ్యనట్టేనా.?

Published on Nov 10, 2022 7:01 AM IST

పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు మన సౌత్ ఇండియా సినిమాలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే నాన్ రాజమౌళి సినిమాలుగా హిందీ బెల్ట్ లో 100 కోట్లు అందుకున్నవి మన టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల నుంచి వచ్చిన “పుష్ప” హిందీ బెల్ట్ లో 100 కోట్ల గ్రాస్ తో అదరగొట్టింది.

ఇక నెక్స్ట్ అయితే ఈ చిత్రం కేజీయఫ్ 2 భారీ వసూళ్లు అందుకుంది. మరి మళ్ళీ నెక్స్ట్ కన్నడ నుంచే “కాంతారా” చిత్రం 70 కోట్ల వసూళ్లకు చేరుకొని డెఫినెట్ గా 100 కోట్ల సినిమాగా నిలిచి పుష్ప ని బీట్ చేసే ఛాన్స్ లు అధికంగా ఏర్పర్చుకుంది అని ప్రస్తుతం టాక్ నడుస్తుంది. అయితే ఒకవేళ కాంతారా పుష్ప ని బీట్ చేసిన చెయ్యనట్టే అని కూడా మనం చెప్పొచ్చు.

ఎందుకంటే పుష్ప రిలీజ్ నాటికి ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు అప్పుడు పుష్ప కూడా లిమిటెడ్ గానే స్టార్ట్ అయ్యినప్పటికీ కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తోనే స్టార్ట్ అయ్యి 100 కోట్ల మార్క్ వసూళ్ళని పుష్ప అందుకుంది. మరి ఈ లెక్కన అయితే పుష్ప 100 కోట్ల వసూళ్ళని కాంతారా అందుకున్నా అందుకోనట్టే అని చెప్పాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు