ఇంటర్వ్యూ : నా పాత్ర తొలగిస్తే ‘కింగ్ ఆఫ్ కొత్త’ అసంపూర్ణంగా ఉంటుంది – హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి

Published on Aug 22, 2023 7:43 pm IST

యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ కింగ్ ఆఫ్ కొత్త. భారీ పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన దీనిని అభిలాష్ జోషి తెరకెక్కించగా వేఫరర్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఆగష్టు 24న ఈ మూవీ పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న సందర్భంగా నేడు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి మీడియా వారికీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

ఈ ప్రాజెక్ట్ లో మీకు అవకాశం ఎలా లభించింది ?
నేను మట్టి కుస్తీ సినిమా చేసేటపుడు దర్శకుడు అభిలాష్ ఈ కథని నాకు వినిపించారు. అలానే ఆయన వినిపించిన నా పాత్ర కూడా ఎంతో నచ్చి మొత్తంగా నేను ఈ ప్రాజక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను.

 

‘కింగ్ ఆఫ్ కొత్త’ లో మీ పాత్ర గురించి చెప్తారా ?
కొత్త అనేది ఫిక్షనల్ గా డైరెక్టర్ క్రియేట్ చేసిన సెట్టింగ్. దుల్కర్ పాత్ర అద్భుతంగా ఉండడంతో పాటు ఆయన ప్రేయసి తార గా ఇందులో కనిపిస్తాను.నిజానికి నా పాత్ర కొంత చిన్నదే అయినప్పటికీ మంచి ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకవేళ నా పాత్ర కనుక తొలగిస్తే కింగ్ ఆఫ్ కొత్త అసంపూర్ణంగా ఉంటుంది. ఫ్రెష్ శ్రోతి లైన్ తో పాటు పాత్రలు అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి.

 

హీరో దుల్కర్ తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ?
దుల్కర్ అద్భుతమైన నటుడు, తనతో కలిసి వర్క్ చేయడం నిజంగా మంచి ఎక్స్ పీరియన్స్. దర్శకుడు తనకు ఏది చెప్పారో దానిని మరింత అద్భుతంగా స్క్రీన్ పై కనిపించేలా పెర్ఫార్మ్ చేస్తారు. సెట్స్ లో అందరితో ఎంతో సరదాగా ఉంటారు. దర్శకుడు జోషి తో కూడా కలిసి పని చేయడం ఎంతో బాగుంది.

 

దర్శకుడు అభిలాష్ జోషి గురించి ?
తనకు కావలసిన అవుట్ ఫుట్ ని నటుల నుండి ఎలా రాబట్టుకోవాలో జోషికి ఎంతో బాగా తెలుసు. తన టాలెంట్ నిజంగా అద్భుతం. ఇక కింగ్ ఆఫ్ కొత్త విషయంలో చూస్తే ఆయన తండ్రి జోషికి కొంత విభిన్నంగా అభిలాష్ వ్యవహరించినట్లు తెలుస్తుంది. జోషి తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. మొత్తంగా తండ్రి కొడుకులు ఇద్దరిదీ డిఫరెంట్ మేకింగ్ స్టైల్.

 

గాడ్ సే తరువాత తెలుగులో ఎందుకు పని చేయలేకపోయారు ?
నేను ఎప్పుడూ తెలుగు సినిమాలు చేయడానికి సంసిద్ధమే. పుష్ప లో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అనే టైపు సొంగ్స్ అయినా సరే, లేదా మహానటి లో కీర్తి సురేష్ పాత్ర అయినా సరే దేనికైనా నేను రెడీ. మరి ఇకపై ఎటువంటి అవకాశాలు ఇక్కడ వస్తాయో చూడాలి.

 

మీ ఫేవరెట్ కో యాక్ట్రెస్ ఎవరు ?
నాకు దసరా మూవీలో కీర్తి సురేష్ యాక్టింగ్ ఎంతో ఇష్టం. అలానే సమంత కూడా ఎంతో మంచి పెర్ఫార్మర్. ఇక లేటెస్ట్ గా వస్తున్న శ్రీలీల, సాయి పల్లవి ల డ్యాన్సింగ్, యాక్టింగ్ కూడా ఎంతో ఇష్టం.

 

మూవీ ప్రొడక్షన్ చేసే ఛాన్స్ ఉందా ?
ప్రస్తుతానికి యాక్టింగ్ పైనే నా పూర్తి ఫోకస్. ఒకవేళ ఏదైనా పూర్తిగా నన్ను సంతృప్తి పరిచే కథ దొరికితే తప్పకుండా ప్రొడ్యూస్ చేస్తాను. అయితే డైరెక్షన్ చేయాలనే ఆలోచన లేదు.

 

మీ ఫ్యూచర్ ప్రాజక్ట్స్ గురించి చెప్పండి?
ప్రస్తుతం ఒక తమిళ సినిమా ఒప్పుకున్నాను త్వరలో దాని డిటైల్స్ మీకు తెలుస్తాయి. అలానే మరికొన్ని న్యూ ప్రాజక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి.

థాంక్యూ ఆల్ ది బెస్ట్

సంబంధిత సమాచారం :