టాక్..అలా అయితే “ఆచార్య” ముందుకు ఛాన్స్ ఉందా..?

Published on Dec 25, 2021 6:00 pm IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మెగా మల్టీ స్టారర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాని మేకర్స్ ఆల్రెడీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4కి ఫిక్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే రీసెంట్ గానే డేట్ ని కూడా చేంజ్ చెయ్యడం లేదని కన్ఫర్మ్ చేసారు. మరి ఇదిలా ఉండగా ఓ టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రీత్యా భారీ సినిమా అయినటువంటి “రౌద్రం రణం రుధిరం” కనుక వాయిదా పడితే ఒకవేళ వాయిదా పడితే కనుక సంక్రాంతి బరిలో ఆచార్య నిలుస్తుందని అంటున్నారు. అయితే దీనికి ఛాన్స్ తక్కువే ఉందని చెప్పాలి.

ఎందుకంటే ఒకవేళ అలా జరిగితే చాలానే పనులు కంగారు కంగారు చెయ్యాల్సి ఉంటుంది. ఇంకా బ్యాలన్స్ ఉన్న సాంగ్స్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఇలా చాలానే ఉన్నాయి. అవన్నీ అవ్వాలి అపుడు సంక్రాంతి రేస్ లో నిలవాలి సో అందుకు అవకాశం ఇప్పుడున్న వ్యవధిలో తక్కువే అని చెప్పాలి. మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది.

సంబంధిత సమాచారం :