చెప్పింది చేయకపోతే 3 ఏళ్లలో రాజీనామా చేస్తాం – రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన రాజకీయ రంగప్రవేశ ప్రకటన ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అందరి రాజకీయ నాయకుల్లా కాకుండా రజనీ స్పీచ్ కొంత స్పెషల్ గా సాగింది. అన్ని రాష్ట్రాలు తమిళలందును చూసి నవ్వుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను మౌనంగా ఉండటం సరికాదు. అందుకే రాజకీయల్లోకి వస్తున్నాను అన్న ఆయన తనకు తానే ఒక నిబంధనను నిర్ణయించుకున్నారు.

ఎన్నికల తర్వాత తమ పార్టీ ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే మూడేళ్ళలోనే స్వతంత్ర్య రాజీనామా చేస్తామని హామీ ఇచ్చారు. నాకు అధికార కాకంక్ష లేదు. ఒకవేళ అధికారమే కావాలనుకుంటే 1996లోనే ఆ అవకాశం వచ్చింది. అప్పుడు ఆశించనివాడిని ఇప్పుడు 68 ఏళ్ల వయసులో ఆశిస్తానా.. ఆధ్యాత్మిక రాజకీయాలు నడపడమే నా లక్ష్యం అంటూ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. రజనీ చేసిన ఈ ప్రకటనతో ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం బయలుదేరింది.