ఇంటర్వ్యూ : హీరో హీరోయిన్ల మధ్య సరదాగా సాగే కథే ‘ఇగో’ – ఆశిష్

హీరోగా ఇప్పుడిప్పుడే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆశిష్ నటించిన చిత్రం ఇగో. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యువ హీరోతో మేము జరిగిపిన ఇంటర్వ్యూ ఓ చిత్రం గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూద్దాం..

ప్ర) ఈ చిత్రంలో మీ పాత్ర గురించి ?

జ) ఈ చిత్రంలో నా పాత్ర పేరు గోపి. అమలాపురం అబ్బాయిగా కనిపిస్తాను.

ప్ర) ఎలాంటి కథతో ఇగో చిత్రం ఉండబోతోంది ?

జ) హీరో, హీరోయిన్ల మధ్య పల్లెటూరి వాతావరణంలో సరదాగా సాగె చిత్రం ఇది. హీరో, హీరోయిన్ మధ్య ఇగో సమస్యలు రావడం, దాని పర్యవసానమే ఈ చిత్ర కథ.

ప్ర) ఈ చిత్ర డైరెక్టర్ గురించి ?

జ) ఇగో మూవీ డైరెక్టర్ సుబ్బు గారు. ఆయన చాలా కూల్. సుబ్బు గారు కోప్పడడం అంటూ ఉండదు. అందరితో చాలా బావుంటారు.

ప్ర) సంగీతం ఎలా ఉంది ?

జ) ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. శ్రేయ ఘోషల్ గారు కూడా ఈ చిత్రంలో ఓ పాట పాడారు.

ప్ర) ఈ చిత్రాన్ని ఎంత బడ్జెట్ లో పూర్తి చేశారు ?

జ) ఓ ఆర్టిస్ట్ గా ఈ చిత్ర బడ్జెట్ గురించి నేను పట్టించుకోలేదు. బడ్జెట్ వ్యవహారాలన్నీ దర్శక నిర్మాతలే చూసుకున్నారు. నేను నటుడిగా బాగా నటించడానికి ప్రయత్నించా.

ప్ర) ఇతర నటీనటుల గురించి ?

జ) ఈ చిత్రంలో మంచి తారాగణం ఉంది. దీక్షా పంత్, పోసాని మరియు రావు రమేష్ వంటి నటులంతా ఈ చిత్రంలో నటించారు. అందరి నటన తప్పకుండా మెప్పిస్తుంది.

ప్ర) నటన పట్ల ఎలా ఆసక్తి కలిగింది ?

జ) స్కూల్ వయసు నుంచే నాటకాల్లో నటించే వాడిని. కొన్ని చిత్రాల ఆడిషన్స్ కు కూడా వెళ్లా. దేవుడిపై నాకు నమ్మకం ఎక్కువ. ఇప్పుడు ఇలా నటించగలుగుతున్నానంటే అది దేవుడి దయే.