పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై దర్శకురాలు ఋషిక దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇక్షు. ఈ చిత్రం లో రామ్ అగ్నివేష్ హీరోగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రీతూ, రేఖ, నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హనుమంత రావు నాయుడు, గౌతమ్ నాయుడు లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయి సినీ పెద్దల నుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.
అయితే ఈ చిత్రం ను అయిదు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా ను ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదించాలి అని నిర్మాత హనుమంత నాయుడు కోరారు. అయితే ఈ చిత్రం లో రామ్ అగ్నివేష్ చక్కగా నటించాడు అని, అయితే సన్నివేశాలు చూసిన ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి అని, తనకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ ఋశిక అన్నారు.
