నా మనసును కలచివేసింది – మాస్ట్రో ఇళయరాజా


భారతీయ గాన కోకిల, లెజెండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్ కరోనా బారిన పడి, నేడు ఆమె తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అశేష అభిమానులను ఎంతగానో అలరించిన ఆ గాన కోకిల ఇక లేరు అని ప్రజలే కాదు, సినీ ప్రముఖులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ లెజెండరీ సింగర్ మరణం పట్ల పలువురు భారతీయ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్ అవుతున్నారు.

కాగా లెజెండరీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా కూడా లతా మంగేష్కర్ మృతి పై రియాక్ట్ అవుతూ ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. ఇళయరాజా మాటల్లోనే.. ‘లతాజీ మరణం నా మనసును కలచివేసింది. ఆమెతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప అదృష్టం. అపురూపమైన ఆ స్వరాన్ని, అందులోని ఆత్మను నేను ఎప్పటికీ ఇష్టపడ్డాను. లతాజీకి మన హృదయాల్లో తిరుగులేని స్థానం ఉంది. ఆమె శాంతితో విశ్రమించి, తన ఆత్మీయ స్వరంతో స్వర్గాన్ని వెలిగించాలి’ అంటూ నివాళులర్పించారు ఇళయరాజా.

తన 13 సంవత్సరాల వయసులో గాయనిగా కెరీర్ ను మొదలు పెట్టిన ఆమె 1942లో తన మొదటి పాటను రికార్డ్ చేశారు. ఆ రోజు నుంచి ఏడు దశాబ్దాల పాటు తన గాత్రంతో అలరించారు.

Exit mobile version