లేటెస్ట్ : ‘వరిసు’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సింపుల్ లుక్ లో అదరగొట్టిన హీరో విజయ్

లేటెస్ట్ : ‘వరిసు’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సింపుల్ లుక్ లో అదరగొట్టిన హీరో విజయ్

Published on Dec 24, 2022 8:32 PM IST

కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ వరిసు. భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో రూపొందుతోన్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. ఇక తెలుగులో వారసుడు టైటిల్ తో ఈ మూవీ రిలీజ్ కానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ యొక్క గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరుగుతోంది. కాగా అశేష అభిమానులతో పాటు వరిసు టీమ్ పాల్గొంటున్న ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి గ్రే కలర్ షర్ట్ క్రీమ్ కలర్ ప్యాంట్ లో ఎంతో సింపుల్ కాస్ట్యూమ్స్ తో విచ్చేసారు హీరో విజయ్. ఆయన ఒక్కసారిగా ఆడియో లాంచ్ ఈవెంట్ దగ్గరకి చేరుకోగానే అభిమనూలు విపరీతంగా హర్షద్వానాలు చేసారు. మొత్తంగా ప్రస్తుతం వరిసు ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్లో జరుగుతోంది. కాగా వరిసు ఈవెంట్ లో విజయ్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు