ప్రెగ్నెన్సీ, ఆత్మహత్య వార్తలపై ఇలియానా ఏమందంటే..

Published on May 6, 2021 12:30 am IST

సినీ తారల గురించి రూమర్లు రావడం చాలా నార్మల్ విషయమే. అదే తారలు ఎవరితోనైనా రిలేషన్లో ఉంటే ఆ పుకార్లు మరింత దారుణంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటి కష్టాన్నే పడ్డానని అంటోంది గోవా బ్యూటీ ఇలియానా. తెలుగునాట సినిమాలు మానేసి పూర్తిగా హిందీకే పరిమితమైన ఇలియానా రెండేళ్ల క్రితం వరకు ఆండ్రు అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సోషల్ మీడియాలో సైతం హడావుడి చేసిన వారిద్దరూ కొన్ని వ్యక్తిగత కారణాల వలన విడిపోయారు. అప్పటి నుండే ఇలియానా మీద రూమర్లు మొదలయ్యాయి.

వీటి మీద తాజాగా స్పందించిన ఆమె ‘రిలేషన్లో ఉన్నప్పుడు నేను గర్భవతినని, అబార్షన్ కూడ చేయించుకున్నానని ప్రచారం జరిగింది. అవన్నీ అవాస్తవాలు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే నేను ఆత్మహత్యకు పాల్పడ్డానని, నా పనిమనిషి నన్ను ఆపిందని, తన వలనే నేను బ్రతికానని అన్నారు. నేను ఎలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేయలేదు. నాకసలు పనిమనిషే లేదు. అవన్నీ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు అలాంటి నిరాధార వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావట్లేదు’ అంటూ అప్సెట్ అయ్యారు.

సంబంధిత సమాచారం :