ఇలియానా ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే!

ileana
ఇలియానా.. తెలుగు, తమిళంలో టాప్ స్టార్స్ సరసన నటించి ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా మెరిసిన స్టార్ హీరోయిన్. అయితే బాలీవుడ్‌లో ఆమె కెరీర్ మొదట్లో బాగానే ఉన్నా, ఆ తర్వాత పూర్తిగా పడిపోయింది. కొద్దికాలంగా ఇలియానాకు గుర్తింపు తెచ్చే సినిమా బాలీవుడ్‌లో పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. ఇటు సౌత్ సినిమాలను వదిలేసి, అటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అంతంతమాత్రమే ఉన్న పరిస్థితుల్లో ఈవారం విడుదలవుతోన్న ‘రుస్తోమ్’ అనే సినిమాపైనే ఇలియానా ఆశలన్నీ పెట్టుకున్నారు.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘రుస్తోమ్’ సినిమాలో ఇలియానా ఓ బలమైన పాత్రలో నటించారు. ఈ శుక్రవారం (ఆగష్టు 12న) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌తో అంచనాలన్నీ తారాస్థాయికి చేర్చింది. ఇక సినిమా కూడా ఆ స్థాయిని అందుకుంటుందన్న ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇలియానా కూడా సినిమా ప్రమోషన్స్‌ కోసం దేశమంతా చుట్టేస్తున్నారు. రేపు సినిమా విడుదలై మంచి విజయం సాధిస్తే, మళ్ళీ తనకు బాలీవుడ్‌లో అవకాశాలు పెరుగుతాయని ఇలియానా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.