మహేష్ సినిమాలో ఇలియానా నటించడంలేదట!


‘స్పైడర్’ చిత్రీకరణను ముగించేసి కొరటాల ప్రాజెక్టులో బిజీగా ఉన్న మహేష్ గత నెలలో తన 25వ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు దర్శక నిర్మాతలు ఇలియానాను సంప్రదించారని వార్తలొచ్చాయి. వీటి వలన వీరిద్దరిదీ హిట్ పెయిర్ కనుక మరోసారి కలిసి నటించే అవకాశం లేకపోలేదని చాలా మంది అనుకున్నారు.

తాజాగా ఈ అంశంపై స్పందించిన చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ వార్తలన్నీ పుకార్లేనని, తామసలు ఇలియానాని సంప్రదించలేదని తేల్చేశారు. దీంతో ఈ రూమర్లకు చెక్ పడ్డట్లైంది. మరి వాస్తవంగా ఇందులో హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ‘ధృవ, ఊపిరి, విక్రమ్ వేద’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన పిఎస్. వినోద్ కెమెరా వర్క్ చేయనున్నారు. 2018 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.