నేను విజయ్‌తో ఒక క్రేజీ పాన్ ఇండియన్ సినిమా చేస్తాను, కానీ – మిస్కిన్

Published on May 26, 2023 3:01 am IST

తమిళ సినీ పరిశమ్రకు చెందిన నటుడు దర్శకుడు మిస్కిన్ తన టాలెంట్ తో అక్కడి ఆడియన్స్ నుండి ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ లియోలో మిస్కిన్ ఇటీవల ప్రముఖ తమిళ స్టార్ విజయ్‌తో కలిసి నటించారు. తాను లియో షూటింగ్‌లో పాల్గొన్నప్పటి నుండి, మిస్కిన్ వివిధ ఇంటర్వ్యూలలో విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో విజయ్‌ని డైరెక్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని యాంకర్ అడిగినప్పుడు, మిస్కిన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

విజయ్‌తో తాను మంచి క్రేజీ పాన్ ఇండియన్ సినిమా చేస్తానని, కేవలం ఒక్క ఫోన్ కాల్‌ తో ఆయన అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవచ్చని అన్నారు. అయితే ఆ సినిమా విజయ్ ని మరియు అతని అభిమానులను సంతృప్తి పరచాలి. అలాగే ఆ స్క్రిప్ట్ నన్ను పూర్తిగా జస్టిఫై చేయడంతో పాటు ఆయనని కూడా కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అని మిస్కిన్ అన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో నటుడు విజయ్‌కి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఒక కథను నేరేట్ చేస్తానని తెలిపారు. అయితే, దీనికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కూడా అని మిస్కిన్ అన్నారు. మరి వీరిద్దరి కలయికలో మూవీ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :