ప్రేమించడం లేదు – ‘ఒక లైలా కోసం’ హీరోయిన్.

pooja-hegde
ప్రస్తుతం నేను ఎవరిని ప్రేమించడం లేదు. షూటింగ్, ట్రావెలింగ్, యాక్టింగ్ లతో టైం అంతా గడిచిపోతుంది. బిజీ షెడ్యూల్స్ నడుమ ప్రేమించే తీరిక ఎక్కడుంది..? అని ఎదురు ప్రశ్నలు వేస్తుంది ‘ఒక లైలా కోసం’ మూవీ హీరోయిన్ పూజ హెడ్గే. అంటే హీరోయిన్ కాకముందు ప్రేమలో పడ్డారా..? అని ప్రశ్నిస్తే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. టీనేజ్ లో ప్రతి ఒక్కరికి ఏదోక లవ్ స్టొరీ తప్పకుండా ఉంటుంది. అదంతా గతం గతః అంటుంది. ఇప్పుడు నా దృష్టి మొత్తం సినిమాల మీద పెట్టాను అని చెప్తుంది.

ముంబైలో పెరిగిన ఈ బెంగుళూరు భామ జాతకం బాగుంది. తొలి సినిమా అవకాశాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో దక్కించుకుంది. ‘ఒక లైలా కోసం’ సినిమాలో నాగ చైతన్యతో రొమాన్స్ చేస్తుంది. తర్వాత మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ముకుందా(టైటిల్ కన్ఫర్మ్ కాలేదు)లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ రెండు విడుదల కాకముందే హిందీలో స్టార్ హీరో హృతిక్ రోషన్ – అశుతోష్ గోవారికర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న హిస్టారికల్ మూవీ ‘మొహెంజో దారో’లో సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.

Exit mobile version