మాస్ మహారాజ ఈజ్ బ్యాక్ అనేలా ‘రాజా ది గ్రేట్’ టీజర్ !


‘బెంగాల్ టైగర్’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రవి తేజ ప్రస్తుతం రెండు సినిమాల్ని సిద్ధం చేస్తున్నారు. వాటిలో ఒకటి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ‘రాజా ది గ్రేట్’. రవి తేజ చూపులేని వ్యక్తిగా నటిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ చూస్తుంటే సినిమా బలమైన కంటెంట్ కలిగి మాస్ మహారాజ ఈజ్ బ్యాక్ అనేలా ఉంది. రవి తేజ కూడా ఈ సినిమా కోసం వర్కవుట్స్ చేసి శరీరాకృతిని మార్చి కొత్తగా కనిపిస్తున్నారు.

అంతేగాక ఈ చిత్రంలో ఆయన మార్షల్ ఆర్ట్స్ ను కూడా ప్రదర్శించారట. ఇందులో కోసం కొన్ని వారాల పాటు ట్రైనర్ వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట. ఇక టీజర్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తుంటే సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందనిపిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన గత చిత్రాలు ‘పటాస్, సుప్రీం’ ల మాదిరిగానే ఇందులో కూడా ఎనర్జిటిక్ ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు ట్రై చేశారు. ఇకపోతే అక్టోబర్ 12న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది.

టీజర్ కొరకు క్లిక్ చేయండి: