నమ్మకాన్ని మరింత పెంచుతున్న ‘ఫిదా’ ట్రైలర్ !
Published on Jul 17, 2017 6:08 pm IST


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ శుక్రవారం విడుదలకు సిద్దమవుతున్న చిత్రం ‘ఫిదా’. టీజర్, ట్రైలర్, పాటలతో ఆకట్టుకుని సినిమా విజయంపై పాజిటివ్ క్రేజ్ క్రియేట్ చేసిన చిత్ర టీమ్ తాజాగా మరొక ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇంతకు ముందు విడుదలచేసిన ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ తో అసలు సినిమా స్వభావం ఏమిటి, ప్రధాన పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది క్లియర్ గా తెలిసిపోతోంది.

శేఖర్ కమ్ముల రాసిన ఈ లవ్ స్టోరీలో అమెరికా అబ్బాయిగా వరుణ్ తేజ్ స్టైలిష్ గా కనిపిస్తుండగా తెలంగాణా గడసరి అమ్మాయిగా సాయి పల్లవి తన స్లాంగ్ తో అదరగొడుతోంది. ట్రైలర్ చూశాక సినిమాలో విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే సరికొత్త రొమాంటిక్ ట్రాక్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనే నమ్మకం కలుగుతోంది. అలాగే పాత్రల డైలాగ్స్ కూడా సహజత్వానికి దగ్గరగా ఉండి కొత్తగా అనిపిస్తున్నాయి. మరి ట్రైలర్ తో ఇన్ని ఆశల్ని రేపిన ఈ సినిమా జూలై 21 శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకురానుంది.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి

 
Like us on Facebook