వైరల్ : కొత్త టికెట్ ధరలతో ఏపీలో స్వచ్చందంగా థియేటర్స్ మూసివేత.!

Published on Dec 23, 2021 2:00 pm IST

గత కొన్నాళ్ల నుంచి ఏపీలో తెలుగు సినిమా పరంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని తెలిసిందే. అలాగే వీటి తర్వాత ఇప్పటికీ కూడా అలానే కొనసాగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా తగ్గించిన టికెట్ ధరలతో పలు థియేటర్స్ వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యినా బాగా తగ్గించేసిన ధరల మూలాన ఇప్పుడు కూడా కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఇతర రేట్స్ కి తగ్గట్టుగా టికెట్ ధరలు లేనందున వారి థియేటర్స్ మైంటైన్ చెయ్యలేకపోతున్నారు.. మరి ఇదిలా ఉండగా ఏపీలో ఒక ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

గోదావరి జిల్లాల్లో ఏకంగా 50 థియేటర్స్ వారు కొన్నాళ్ల పాటు తమ థియేటర్స్ ని ఇప్పుడున్న సినిమాలు ఆపేసి మరీ స్వచ్చందంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. అయితే నిన్ననే ఏపీలో 10 థియేటర్స్ ని సీజ్ చేసినట్టుగా వచ్చిన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి మళ్ళీ ఈరోజు ఇలా జరగడం అందరినీ మరింత షాక్ కి గురి చేసింది. దీనితో ఇది మరింత వైరల్ అవుతుంది. ఇక ఈ సమస్యకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :