ఆర్యన్ కేసు..’లైగర్’ హీరోయిన్ పేరు సహా ఇంకో ఇద్దరు.!

Published on Oct 21, 2021 6:05 pm IST

కొన్ని రోజులు కితమే బాలీవుడ్ బాద్షా షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు ఉదయమే షారుఖ్ ఆర్యన్ ని ముంబై జెల్లో కలిసి ఓ అరగంట పాటు మాట్లాడి బయటికి రావడం కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఈ కీలక మీట్ ఓ పక్క జరిగిన క్రమంలోనే మరో షాకింగ్ వార్త బయటకి వచ్చింది. ఈ కేసుకి రిలేటెడ్ గానే ప్రముఖ హీరోయిన్ అనన్య పాండే పేరు కూడా బయటకి రావడంతో ఆమెను కూడా నార్కోటిక్ శాఖ వారు విచారించడం వైరల్ గా మారింది.

అలాగే ఇప్పుడు మరో టాక్ ఏమిటంటే ఈ కేసుకు సంబంధించి అనన్య పేరు సహా ఇంకో ఇద్దరి కీలక వ్యక్తులు పేర్లు కూడా ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అనన్య అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ “లైగర్” అనే పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ట్విస్ట్ ఎక్కడ వరకు దారి తీస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More