సీడెడ్ లో కూడా అదరగొట్టిన “అఖండ”..డే 1 ఫిగర్ ఇదే.!

Published on Dec 3, 2021 1:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణకి ఒక సరైన మాస్ బొమ్మ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మళ్ళీ తన లేటెస్ట్ సినిమా “అఖండ” తో చూపించారు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన సినిమా అంటేనే మినిమమ్ గ్యారెంటీ దాన్ని దశాబ్ద కాలం కిందటే చూపించారు. ఇక ఇప్పుడు అఖండ తో హ్యాట్రిక్ కొట్టేసారు.

మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ తో వచ్చిన ఈ చిత్రం ఒక్కో ఏరియా లో బాలయ్య కెరీర్ లో అధిక వసూళ్లతో అందులోని గట్టి మార్జిన్ తోనే కొడుతుంది. ఆల్రెడీ నైజాం లో రికార్డు ఓపెనింగ్ అందుకున్న బాలయ్య తనకి మరో స్ట్రాంగ్ స్టార్డం ఉన్న సీడెడ్ లో కూడా అదరగొట్టినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి గాను సీడెడ్ లో 3.45 కోట్లు షేర్ వచ్చిందట. డే 1 కి ఇంత అంటే మాస్ సినిమాలకే సాధ్యం అందులోని బాలయ్య లాంటి హీరోలకే చెల్లుతుంది. డీసెంట్ టార్గెట్ తోనే రంగంలోకి దిగిన చిత్రం ఫైనల్ రన్ లో సింపుల్ గానే మొత్తం కొట్టెయ్యొచ్చు.

సంబంధిత సమాచారం :