స్మాల్ స్క్రీన్ పై వెరీ స్పెషల్ ఎపిసోడ్..ఆలీతో లెజెండ్ ‘బ్రహ్మానందం’

Published on Nov 23, 2021 10:11 pm IST


తెలుగు బుల్లితెరపై ఓ అద్భుతమైన నెవర్ బిఫోర్ ఎపిసోడ్ కి ఈటీవీ వారు శ్రీకారం చుట్టారు. ఈటీవీ ఛానెల్లో ప్రతీ రోజు కూడా ఓ ఇంట్రెస్టింగ్ షో టెలికాస్ట్ అవుతుందన్న సంగతి తెలిసిందే. అలాగే కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా చేస్తున్న షో “ఆలీతో సరదాగా”. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంత గానో ఆదరించే ఈ షోలో ఎందరో లెజెండరీ నటులు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు.

మరి ఈ షో కెరీర్ లోనే కాకుండా తెలుగు బుల్లితెర హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచే ఎపిసోడ్ ని హాస్య బ్రహ్మ, గిన్నీస్ అవార్డు గ్రహీత లెజెండ్ బ్రహ్మానందం గారితో ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. దాని తాలూకా ప్రోమోకి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ ప్రోమోలో అదే ఎనర్జీ కామెడీ టైమింగ్ తో బ్రహ్మానందం అదరగొట్టేసారు. ఇది చూసిన వారు ప్రతీ ఒక్కరికీ కూడా ఓ రకమైన ఆనందం రావడం గ్యారెంటీ. మరి దీనిపై అసలు ప్రోమో ఇంకా ఎపిసోడ్ ఎలా ఉంటాయో తెలియాలి అంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More