ఈ యంగ్ ఫిల్మ్ మేకర్ కి కూడా బాలయ్య ఛాన్స్ ఇచ్చేయొచ్చేమో?

Published on Oct 29, 2021 7:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం తన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన భారీ బడ్జెట్ సినిమా “అఖండ” కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అనంతరం వచ్చిన గ్యాప్ లో బాలయ్య ఊహించని విధంగా ఓ ఓటిటి షో ఓకే చేసి మరో కిక్ ఇచ్చారు. అయితే ఇపుడు బాలయ్య ను గమనిస్తే కంప్లీట్ చేంజ్ కనిపిస్తుంది.

కొత్త దర్శకులకి మంచి ఫామ్ లో ఉన్నవాళ్ళకి అవకాశం ఇస్తూ తన నుంచి మరింత కొత్తదనం అందిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో బాలయ్య టాలీవుడ్ కి దొరికిన మరో యంగ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చెయ్యొచ్చేమో అనిపిస్తుంది. తన ఆహా షో “అన్ స్టాప్పబుల్” ను ప్రశాంత్ నే దర్శకత్వం వహిస్తున్నాడు.

తాను బాలయ్యతో చేసిన ఫస్ట్ ప్రోమో కట్ ను చూస్తే నెవర్ బిఫోర్ విజువల్స్ అలాగే బాలయ్యను ప్రెజెంట్ చేసిన విధంగా ప్రతీ ఒక్కరినీ ఇంప్రెస్ చేసింది. సో ఎలాగో దీనికి వర్క్ చేసిన ఈ ఇద్దరు ఫ్యూచర్ లో ఓ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాతో వస్తే మంచి విజువల్ ట్రీట్ కన్ఫర్మ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More