ఇంట్రెస్టింగ్..లోకేష్ నుంచి మరిన్ని ఇలాంటి సినిమాలు.?

Published on Jun 11, 2022 7:03 am IST


ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర బాగా వినిపిస్తున్న దర్శకుడు పేరు లోకేష్ కనగ్ రాజ్. లోక నాయకుడు కమల్ హాసన్ తో చేసిన భారీ యాక్షన్ మల్టీ స్టారర్ చిత్రం “విక్రమ్” రిలీజ్ తర్వాత లోకేష్ పేరు సెన్సేషన్ గా మారింది. అయితే ఇంతలా మాట్లాడుకోడానికి కారణం తన సినిమాటిక్ యూనివర్స్ అనే చెప్పాలి. ఒక్కో సినిమాని మరో సినిమాతో లింక్ చేస్తూ సాలిడ్ ట్రీట్ ఇవ్వడంతో ఆడియెన్స్ బాగా థ్రిల్ అయ్యారు.

దీనితో నెక్స్ట్ వచ్చే విక్రమ్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ లైనప్ పై ఇంట్రెస్టింగ్ టాక్ మరొకటి వినిపిస్తుంది. ఈ దర్శకుడి నుంచి కేవలం విక్రమ్ లోని పాత్రలు మాత్రమే కాకుండా ముందు చేయబోయే సినిమాలు నుంచి కూడా ఈ తరహా బ్రాంచెస్ ట్రీట్ ఉంటుంది అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ దర్శకుడు నుంచి భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికర సినిమాలు చూడొచ్చని చెప్పాలి.

సంబంధిత సమాచారం :