నెల్లూరులో సూర్య ‘మాస్’ యాక్షన్..

surya
తమిళ స్టార్ సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ నెల్లూరులో జరుగుతుంది. కృష్ణపట్నం పోర్టులో భారి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. స్టన్ శివ ఈ ఫైట్ సీక్వెన్స్ లను కోరియోగ్రఫీ చేస్తున్నారు. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. సూర్య, పార్తిబన్, సముద్రఖని, రియాజ్ ఖాన్ తదితర నటీనటులు షూటింగులో పాల్గొంటున్నారు.

యాక్షన్ & సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, ప్రణిత హీరోయిన్లు. ఆల్రెడీ, టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మూవీ యూనిట్ బ్యాంకాక్ పయనమవుతారు. అక్కడ సాంగ్స్ షూట్ చేయనున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ కొత్త సంవత్సరం కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version