సరిగ్గా ఇంకో ఏడాదిలో చరణ్, శంకర్ ల బాక్సాఫీస్ బ్లాస్ట్.!

Published on Jan 14, 2022 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉండగా దీని తర్వాత చరణ్ మరో ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ తో తమ కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా 15వ సినిమాగా ప్లాన్ చేసింది కూడా ఒకటి.

మళ్ళీ వింటేజ్ శంకర్ తరహాలో సాలిడ్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. అయితే మరి ఈ భారీ సినిమాపై ఒక అదిరే అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఇదే సమయానికి అంటే వచ్చే ఏడాది ఇదే సంక్రాంతి బరిలో రిలీజ్ చేయబోతునట్టుగా నిర్మాత దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఈ భారీ సినిమాపై ఒక్కసారిగా మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ ఈ కాంబో అనౌన్సమెంట్ తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు ఖాయం అని అనుకున్నారు అంతా ఇక ఇప్పుడు టైం కూడా చెప్పేయడంతో అభిమానులు రోజులు లెక్కపెట్టుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :