ఓటిటిలో కూడా రికార్డ్స్ తోనే వేట స్టార్ట్ చేసిన “అఖండ”.!

Published on Jan 22, 2022 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా “అఖండ” మొన్నటితో థియేటర్స్ లో విజయవంతంగా 50 రోజులు రన్ పూర్తి చేసుకుని నిన్నటి నుంచి ఓటిటి లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

మరి ఆడియెన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తన్నా ఈ సినిమాకి ఓటిటి లోకి వస్తుండడంతోనే రికార్డుల వేటతో ఈ చిత్రం స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ అయ్యి 24 గంటలు దాటక ముందే 1 మిలియన్ స్త్రీమింగ్స్ ఈ చిత్రానికి దక్కాయట. ఇది ఏ తెలుగు సినిమాకి రాని వ్యూస్ అని తెలుస్తుంది.

మొత్తానికి మాత్రం బాలయ్య అఖండ సెన్సేషన్ ఓటిటి లో ఓ రేంజ్ లోనే మొదలైంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :