“RRR” లో రాజమౌళి చెప్పిన ఆ క్రేజీ సీక్వెన్స్ ఎన్టీఆర్ మీదనేనా.?

Published on May 21, 2022 4:17 pm IST


ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యిఉంజి టైగర్ ఎన్టీఆర్ లు నటించిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం కోసం ఆడియెన్స్ గాని ఆ హీరోల అభిమానులు గాని ఎంతలా ఎదురు చూసారో గత కొన్ని నెలలు గత ఏడాది కితం రోజులు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది.

అయితే మరి ఎట్టకేలకు జనవరి రిలీజ్ పై అప్డేట్ ఇవ్వగా ఆ సమయం ప్రమోషన్స్ లో అప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్ అంతెందుకు ట్రైలర్ లో కూడా చూపించని ఒక క్రేజీ సీక్వెన్స్ ఆడియెన్స్ ప్రతి ఒక్కరి నరాలను కదిలిస్తుంది అని ఒక రేంజ్ లో హైప్ ఇచ్చారు. ఆ సీన్ కోసం ఇప్పుడు వరకు మేము చెప్పలేదు అని గట్టి సస్పెన్స్ ని నెలకొల్పారు.

అయితే ఆ సీన్ ఏంటి అనేది వారు చెప్పకపోయినా సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఒటిటి లో వచ్చాక ఆ సీన్ డెఫినెట్ గా ఎన్టీఆర్ పై తీసిన మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ నే అనిపిస్తుంది. అదే జస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్కాట్ బంగ్లా లో జరిగే పార్టీకి తన అడవి మృగాలు అన్నిటిని తీసుకొని వెళ్లి దూకే సీక్వెన్స్.

ఇది అసలు ఇండియన్ సినిమా దగ్గర ఒక మాసెస్ట్ గూజ్ బంప్స్ ఇచ్చే సీన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ కూడా ఈ సీన్ ని ఫస్ట్ టైం చూసినపుడు ఆడియెన్స్ కలిగిన అనుభూతిని నెమరు వేసుకుంటున్నారు. అంటే ఈ లెక్కన ఈ చిత్రంలో రాజమౌళి చెప్పిన ఆ స్టన్నింగ్ సీక్వెన్స్ ఇదే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :