ఇంటర్వ్యూ : ఆది సాయికుమార్ – ‘శమంతకమణి’ లో అందరు హీరోలకు సమానమైన ఇంపార్టెన్స్ ఉంది !
Published on Jul 5, 2017 5:39 pm IST


దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘శమంతకమణి’. ఈ సినిమాలో నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్ లు హీరోలుగా నటిస్తున్నారు. వీళ్ళలో ఆది సాయికుమార్ ఈరోజు మీడియాతో సమావేశమై సినిమా విశేషాల్ని పంచుకున్నారు. అవి మీ కోసం..

ప్ర) ఈ సినిమా దేని గురించి నడుస్తుంది ?
జ) సినిమా మొత్తం ఒక కారు చుట్టూ నడుస్తుంది. ఆ కారు పేరు ‘శమంతకమణి’. పూర్తిగా థ్రిల్స్ తో నిండిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతుంది.

ప్ర) ఈ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది ?
జ) డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య నాకు ఫోన్ చేసి నేనిలా సినిమా చేస్తున్నాను, అందులో నలుగురు హీరోలు, ఇప్పటికే ముగ్గురు సెట్టయ్యారు. నాలుగో హీరో మీరైతే బాగుంటుందని అన్నాడు. అప్పుడు నేను కథ ఇంటికొచ్చి పూర్తి కథ చెప్పమన్నాను.

ప్ర) నలుగురు హీరోలని మొదట చెప్పినప్పుడు ఏమనిపించింది ?
జ) ఆ మాట విన్న మొదటిసారి కాస్త కంగారు కలిగినా ముగ్గురు హీరోలో ఓకే చేశారంటే ఖచ్చితంగా మంచి కథే అయ్యుంటుంది. కాబట్టి నా పాత్ర బాగుంటే తప్పకుండా చేద్దాం లేకుంటే లేదు అనుకున్నాను.

ప్ర) కథ విన్నాక ఏమనిపించింది ?
జ) శ్రీరామ్ ఇంటికి రాగానే నాకు నా పాత్రతో పాటు మొత్తం కథ చెప్పమని అడిగా. శ్రీరామ్ 2 గంటల్లో పూర్తి స్క్రిప్ట్, సన్నివేశాలు, వాటికి అనుకున్న రీ రికార్డింగ్ తో సహా వివరించాడు. ఫస్టాఫ్ పూర్తవగానే సినిమాకు ఓకే చెప్పేయాలని అనుకున్నా.

ప్ర) ఇందులో కారు ప్రత్యేకత ఏంటి ?
జ) ఈ సినిమాలో వాడిన కారు 1970 ల నాటి రోల్స్ రోయ్స్. దాని విలువ రూ.5 కోట్లు. షూటింగ్ కోసం రోజుకు రూ.40,000 రెంట్ ఇచ్చే వాళ్ళం.

ప్ర) ఇందులో ఎవరి రోల్ బాగుంటుంది ?
జ) ఒకరిది బాగుంటుంది మరొకరిది బాగుండదని కాదు. ప్రతి ఒక్కరి రోల్ చాలా బాగా డిజైన్ చేశారు. ఒకటి తక్కువ మరొకటి ఎక్కువ అనే తేడాలే లేవు. ప్రతి ఒక్కరికి ఎలివేషన్ సీన్స్ ఉంటాయి.

ప్ర) మీ పాత్ర కాకుండా వేరే ఏ పాత్ర నచ్చింది ?
జ) నాకు నా పాత్రే ఎక్కువగా నచ్చింది. అది నాకు బాగా సరిపోయే పాత్ర. అలాగే ఒక రోహిత్ పాత్రకు రోహిత్, సందీప్ పాత్రకు సందీప్, సుధీర్ పాత్రకు సుధీర్ అందరూ పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు.

ప్ర) మీ రోల్ ఎంతసేపుంటుంది ?
జ) ప్రతి పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. మొదటి నుండి చివరి వరకు అందరికీ ముఖ్యమైన సీన్స్ ఉంటాయి. విడివిడి సన్నివేశాలే కాకుండా కాంబినేషన్ సీన్లు కూడా ఉంటాయి.

ప్ర) మీ క్యారెక్టర్ కోసం ఎన్ని రోజులు షూట్ చేశారు ?
జ) నా పాత్ర కోసం 15 రోజులు షూట్ చేశాను. అన్ని సీన్లు చాలా బాగా వచ్చాయి.

ప్ర) మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నేను ఇంజనీరింగ్ పూర్తై ఉద్యోగం వెతుక్కునే కుర్రాడిని. మధ్యలో నాకో లవ్ స్టోరీ ఉంటుంది. మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాను.

ప్ర) మీ తర్వాతి సినిమాలేంటి ?
జ) విఏ మూవీస్ బ్యానర్లో ఈటీవీ ప్రభాకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నా. అది హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అదొక తమిళ సినిమా రీమేక్. యూఎస్ ప్రొడక్షన్ లో ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. ఒకొక ప్రాజెక్ట్ డిస్కషన్స్ లో ఉంది.

 
Like us on Facebook