సూర్య “ఈటి” లో ఒక్క యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు.!

Published on Feb 24, 2022 2:15 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మరియు అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఈటి” అని చెప్పాలి. దర్శకుడు పాండిరాజ్ తో రెండు క్లీన్ అనంతరం సూర్య చేస్తున్న మాస్ ప్రాజెక్ట్ ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అలా తర్వాత ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం చేస్తూ అనౌన్స్ చెయ్యడం మరింత ఆసక్తి రేపింది.

మరి రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చి తెలుగు మరియు తమిళ్ టీజర్స్ తో మరింత హైప్ ని ఈ చిత్రంపై తీసుకొచ్చారు. మరి ఈ టీజర్స్ తో ఈ చిత్రం కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ లా ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అదిరే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సూర్య వింటేజ్ యాక్షన్ డ్రామాలలో కనిపించిన మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉంటాయట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే మార్చ్ 10 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :