అక్కడ మాత్రం సూపర్ స్ట్రాంగ్ గా “అఖండ”.!

Published on Nov 30, 2021 1:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “అఖండ” ఎట్టకేలకు రిలీజ్ కి దగ్గరవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అని టాక్ ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం అఖండ కి సాలిడ్ క్రేజ్ నెలకొంది.

యూఎస్ మరియు యూకే లాంటి ప్రదేశాల్లో ఆల్రెడీ అఖండ అదిరే బుకింగ్స్, ప్రీ సేల్స్ జరుపుకుంటుంది. దీనితో మంచి ప్రీమియర్స్ ఫిగర్ ని ఈ చిత్రం కొల్లగొట్టడం ఖాయం అని తెలుస్తుంది. మరి రేపటి వరకు ఆగితే ఈ లెక్క కూడా బయటకి వస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :