“బిగ్ బాస్ 5”..ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ.?

Published on Oct 16, 2021 6:02 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 5 లోకి వచ్చి గతంలో లానే డీసెంట్ రెస్పాన్స్ తో వీక్ టైం లో దూసుకెళ్తుంది. ఇక బిగ్ బాస్ షో అంటే అందులో కంటెస్టెంట్స్ మధ్య నడిచే ఆటలు వాగ్వాదాలు అన్నీ చూస్తూనే ఉంటాము. అలాగే అలా గేమ్ అవుతున్న కొద్దీ కొంతమంది కంటెస్టెంట్స్ పై ఆడియెన్స్ లో కూడా క్లారిటీ వచ్చి క్రేజ్ పెరుగుతుంది.

మరి అలా క్రేజ్ పెంచుకున్న ఓ కంటెస్టెంట్ కి అలాగే ఆల్రెడీ మంచి క్రేజ్ తో హౌస్ లో అడుగు పెట్టిన కంటెస్టెంట్ కి మంచి పోటీ నడుస్తుందట. వారే సింగర్ శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్ లు. వీరిద్దరూ తమదైన గేమింగ్ తో షో ఫాలోవర్స్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి కాస్త తేడాలో ఓటింగ్ నమోదు అవుతుందట. ఇక ముందుముందు రోజుల్లో వీరి నడుమ పోటీ ఎలా ఉంటుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More