ఈ సినిమాతో వింటేజ్ ఎనర్జిటిక్ ప్రభాస్ ని మళ్ళీ చూడబోతున్నామా.!

Published on Jun 17, 2022 8:00 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన లైనప్ లో అన్నీ గ్రాండ్ స్కేల్ ప్రాజెక్ట్ లు వరల్డ్ లెవెల్ ఇంపాక్ట్ ఉన్నవే ఉన్నాయి. అయితే ప్రభాస్ నుంచి ఒక పర్ఫెక్ట్ ట్రీట్ కోరుకుంటున్న అభిమానులకి మాత్రం తాను అసలైన ట్రీట్ ని అందిస్తానని ఓ డైరెక్టర్ చెబుతున్నాడు. ఆ దర్శకుడే మారుతీ.

లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తాను మాట్లాడుతూ తన సినిమాతో మళ్ళీ “బుజ్జిగాడు”, “డార్లింగ్” సినిమాల్లో కనిపించిన ఎనర్జిటిక్ ప్రభాస్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాని. ప్రస్తుతం ఆ పనుల్లో మా టీం అంతా ఉన్నామని డెఫినెట్ గా మళ్ళీ ప్రభాస్ ని అలా చూస్తారని ఒక హోప్ ని అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి మారుతీ ఇచ్చాడు. ఇదే కానీ జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏ పాన్ ఇండియా సినిమా కూడా ఇవ్వని కిక్ ఈ ఒక్క చిత్రం ఇస్తుందని చెప్పాలి. అసలే ప్రభాస్ నుంచి వింటేజ్ టైమింగ్ ని యాటిట్యూడ్ గా ఫ్యాన్స్ బాగా మిస్సవుతున్నారు.

సంబంధిత సమాచారం :