Irumbu Kai Mayavi: లోకేష్, బన్నీ ప్రాజెక్ట్ ఈ నెలలోనే మొదలు?

Irumbu Kai Mayavi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు పుష్ప 2 లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత వరల్డ్ లెవెల్ సినిమాని దర్శకుడు అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కాకుండా నెక్స్ట్ తన లైనప్ లో మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఉన్నట్టు టాక్ వచ్చింది. ఇక ఈ క్రేజీ కలయికలో సినిమా ఆల్మోస్ట్ ఖరారు అయినట్టే అని రూమర్స్ కూడా మొదలయ్యాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. ఈ రానున్న కొన్ని రోజుల్లోనే ఈ సినిమాపై అఫీషియల్ అప్డేట్ అనౌన్సమెంట్ పై రానుండగా షూటింగ్ కూడా ప్లాన్ ని లోకేష్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఈ ఏడాది మిడ్ కి పూర్తి కానుంది.

ఇక ఆ తర్వాత బన్నీ కొత్త లుక్ ని ప్రిపేర్ చేసి ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ ని మొదలు పెట్టే ఛాన్స్ ఉందట. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఇరుంబు కై మాయావి’ (Irumbu Kai Mayavi) గా తెరకెక్కిస్తుండగా దీనికోసం అల్లు అర్జున్ కొత్త లుక్ లోకి మారాల్సి ఉంటుంది. సో అలా అక్టోబర్ నుంచి మొదలు పెట్టే యోచనలో ఉన్నట్టు వినికిడి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version