వైరల్ : నీల్ బర్త్ డే లో ఇండియాస్ బాక్సాఫీస్ డైనమైట్స్ ప్రభాస్, యష్.!

Published on Jun 4, 2022 8:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ దగ్గర తన సినిమాలతో భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల నుంచి వచ్చిన “కేజీయఫ్ 2” ఒకటి. అయితే ఈ క్రేజీ కాంబో తర్వాత మరో బిగ్గెస్ట్ ఇండియన్ స్టార్ అయినటువంటి ప్రభాస్ తో ఇప్పుడు “సలార్” సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ప్రభాస్ – ప్రశాంత్ – యష్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం వైరల్ గా మారింది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టిన తోజు సందర్భంగా ఈ మెగా ఫ్రేమ్ ఇప్పుడు బయటకి వచ్చింది.

నీల్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ఈ ఇద్దరు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ డైనమైట్స్ కనిపించడంతో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలె వారు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అయితే ఈ వేడుకల కోసం ప్రభాస్ హైదరాబాద్ నుంచి బెంగళూర్ వట్రకు రావడంతో మరింత ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

సంబంధిత సమాచారం :