‘ఇండియన్ 2’ క్లైమాక్స్ లో భారీ సర్ ప్రైజ్ !

‘ఇండియన్ 2’ క్లైమాక్స్ లో భారీ సర్ ప్రైజ్ !

Published on May 17, 2024 3:00 AM IST

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్‌ వైరల్‌గా మారాయి. ఇంతకీ, ఆ అప్ డేట్స్ ఏమిటో చూద్దాం రండి. ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉండబోతోందని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం పార్ట్‌ 2తో పాటే మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ రెండు సినిమాలను ఏడాదిలోపే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్.

అన్నట్టు ఈ మూవీ టీమ్‌ మరో భారీ సర్‌ప్రైజ్‌ ను కూడా ప్లాన్ చేసింది. పార్ట్‌ 2 క్లైమాక్స్ లో మూడో భాగం ట్రైలర్‌ను ప్రదర్శించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పైగా అదే రోజున పార్ట్‌ 2 విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని జులై 12కు వాయిదా వేసినట్లు టాక్‌. మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం యూనిట్‌ ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తోందట. కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు