జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న ప్రముఖ నటుడు కన్నుమూత !

ఎన్నో సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ కన్నడ రచయిత మరియు నటుడు గిరీష్ కర్నాడ్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా ఈ ఉదయం అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి తరలించినప్పటికీ ఆయన అప్పటికే మృతి చెందారు.

గిరీష్ కర్నాడ్ కర్నాటకకు ఏడవ జ్ఞానపీఠ పురస్కారం అందించి.. కన్నడ సాహిత్యనానికే వన్నెలద్దిన ప్రసిద్ధ నాటక సాహిత్యవేత్త. భారత దేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు కావించినందుకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నమొట్టమొదటి నాటకసాహిత్యవేత్త కూడా గిరీష్ కర్నాడ్ కావడం విశేషం.
గిరీష్ కర్నాడ్ తెలుగుజనాలకు పరిచితుడే. ఈయన పలు తెలుగు చలనచిత్రాలలో భిన్నమైనపాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించారు.

Exit mobile version