“గాడ్ ఫాథర్” లో స్పెషల్ సాంగ్ కి ఇండియన్ మైఖేల్ జాక్సన్.!

Published on May 3, 2022 9:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ లలో ఇంట్రెస్టింగ్ రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటిలో మళయాళ సూపర్ హిట్ సినిమా “లూసిఫర్” కి రీమేక్ గా తీస్తున్న “గాడ్ ఫాథర్” ఒకటి. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కన్నా చాలా బెటర్ గా తెరకెక్కుతూ భారీ తారాగణం తో వస్తుంది.

మరి ఇదిలా ఉండగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాకి గాను మెగాస్టార్ మరియు సల్మాన్ లపై ఒక స్పెషల్ సాంగ్ చేయించేందుకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ని రంగంలోకి దింపినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మెగాస్టార్ మరియు ప్రభుదేవా కాంబోలో ఒక సాంగ్ వచ్చి అయితే చాలా కాలం అయ్యింది.

మరి ఈ సినిమాలో సాంగ్ అయితే అదిరిపోయేలా ఉండడం ఖాయం అని సంగీత దర్శకుడు థమన్ కూడా అంటున్నాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :