RRR టీమ్ కి ఇండియన్ మైఖేల్ జాక్సన్ సూపర్ ట్రిబ్యూట్

RRR టీమ్ కి ఇండియన్ మైఖేల్ జాక్సన్ సూపర్ ట్రిబ్యూట్

Published on Mar 18, 2023 11:10 PM IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే హాలీవుడ్ తో పాటు అనేక భాషల, దేశాల ఆడియన్స్ ని ఆకట్టుకుని గ్లోబల్ గా మంచి రీచ్ ని సొంతం చేసుకుంది. అటు బాక్సాఫీస్ పరంగా కూడా సంచలనాలు సృష్టించిన ఈ మూవీ పలు అంతర్జాతీయ అవార్డులని సైతం కొల్లగొడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్ కి చాటి చెప్పింది.

ఇక ఈ మూవీకి ఆస్కార్ లభించడంతో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులతో పాటు కోట్లాది ప్రేక్షకులు సైతం జక్కన్న టీమ్ పై గొప్పగా ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవా రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న RC 15 సెట్స్ లో భాగం తన డ్యాన్సర్స్ గ్రూప్ తో కలిసి నాటు నాటు సాంగ్ కి స్టెప్పులేసి RRR టీమ్ కి గొప్పగా ట్రిబ్యూట్ ని అందించారు. కాగా వారందరితో కలిసి చేసిన ఆ డ్యాన్స్ వీడియోని ప్రభుదేవా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు