‘యూఎస్ఏ’లో ఇండియన్ సినిమాల సండే కలెక్షన్స్

Published on Mar 14, 2022 2:48 pm IST

భారతీయ చలన చిత్రాలకు యూఎస్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. శంకర్ , రాజమౌళి పుణ్యమా అని మన ఇండియన్ సినిమాలకు అక్కడ మరింత క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఎలాగూ తెలుగు సినిమా అంటే.. ఇండియాలో నార్త్ జనాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ లో మంచి కలెక్షన్లను రాబట్టి కొన్ని సినిమాలు సౌత్ సినిమా సత్తాను చాటుతున్నాయి.

అయితే, కొన్ని ఇండియన్ సినిమాలు యూఎస్ లోనూ అద్భుత కలెక్షన్స్ ను సాధిస్తూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక నిన్న ఆదివారం రోజున మన ఇండియన్ సినిమాలు యూఎస్ఏ లో ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టాయో చూద్దాం.

యూఎస్ఏ లో భారతీయ చలన చిత్రాలు ఆదివారం నాడు రాబట్టిన గ్రాస్ లిస్ట్.

కశ్మీర్ ఫైల్స్ : $ 202,565 డాలర్లు.

రాధేశ్యామ్ : $ 155,505 డాలర్లు.

గంగూబాయి కతియావాడి : $ 112,228 డాలర్లు.

భీష్మ పర్వం : $ 31,461 డాలర్లు.

‘ఇ.టి’ : $ 17,002 డాలర్లు.

సంబంధిత సమాచారం :