మహేష్ మాట నిజం చేసిన భారత్ అండర్19 జట్టు.!

Published on Feb 6, 2022 7:09 am IST


మన దేశంలో ప్రజలు అనేక అంశాలతో పాటు తమ జీవితంలో క్రికెట్ ఆటకి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. ఇంకా ఇదైతే మన దగ్గర ఒక భాగం అని కూడా చెప్పొచ్చు. మరి ఇంత సెంటిమెంట్ గా నమ్మే క్రికెట్ లో వరల్డ్ కప్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకం. ఇక ఈ వరల్డ్ కప్ పోటీలో నిన్న అండర్ 19 ఫైనల్స్ జరగగా మన దేశపు యువకుల జట్టు ఇంగ్లాండ్ తో తలపడడం జరిగింది. మరి ఈ ఉత్కంఠ భరిత పోరులో మన దేశం యంగ్ బ్లడ్ ఇంగ్లండ్ ని 4 వికెట్ల తేడాతో చిత్తు గా ఓడించి ప్రపంచ కప్ ని భారతదేశానికి తీసుకొచ్చారు.

అయితే మన టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న భారత్ జట్టుకు విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. బహుశా నిన్న మహేష్ ఒకరే ఈ అండర్ 19 వరల్డ్ కప్ కోసం మాట్లాడినట్లు ఉన్నారు. ఏదైతేనేం ఫైనల్ గా మాత్రం మహేష్ కోరుకున్న విధంగానే తన మాట అయితే మన ఇండియన్ టీమ్ నిజం చేసి చూపించి భారతీయులు ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం కలిగించేలా చేశారు. నిజానికి అయితే ఇంగ్లండ్ లో అది కూడా ఇంగ్లండ్ తో మాచ్ అని చాలా మందికి నమ్మకం కూడా లేదు. కానీ ఫైనల్ గా ఈ గ్రాండ్ ఫైనల్స్ లో నెగ్గి చరిత్ర సృష్టించారు.

సంబంధిత సమాచారం :