‘ఇంద్రసేన’ పొలిటికల్ సినిమా కాదట !
Published on Nov 30, 2017 8:46 am IST

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘ఇంద్రసేన’. ఈ చిత్రం ఈరోజే విడుదలకానుంది. తమిళంలో కూడా ‘అన్నాదురై’ పేరుతో ఈరోజే సినిమా రిలీజవుతోంది. మొదట్లో టైటిల్ చూసి అంతా ఇదేదో పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే కథగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా అలా ఉండదని, దర్శకుడు శ్రీనివాసన్ వాస్తవంగా చుసిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని విజయ్ ఆంటోనీ అన్నారు.

ఈ చిత్రంలో ఆయన డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. భారీస్థాయిలో ప్రమోషన్లు చేపట్టడం, విడుదలకు ముందే 10 నిముషాల సినిమాను ప్రదర్శించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అంతేగాక విజయ్ గత చిత్రాలు ‘బిచ్చగాడు, భేతాళుడు, డా.సలీం’ వంటివి మంచి విజయాలు సాదించడంతో ఈ సినిమాను మంచి ధరకే కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు.

 
Like us on Facebook