‘ఇంద్రసేన’ ఆడియో విడుదల తేదీ ఖరారు !

‘బిచ్చగాడు’ సినిమాతో సంచలన విజయం సాదించిన విజయ్ ఆంటోనీ తాజా చిత్రం ‘అన్నాదురై’. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతొ విడుదలచేయనున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను రాధిక శరత్ కుమార్, విజయ్ ఆంటోనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా, హీరోగానే కాకుండా విజయ్ ఆంటోని ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా కూడా పని చేస్తుండడం విశేషం.

ఇకపోతే ‘ఇంద్రసేన’ ఆడియోను ఈ నెల 16న రిలీజ్ చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే 15న జరగనున్న తమిళ ఆడియో వేడుకలో 10 నిముషాల సినిమాను ప్రదర్శించనున్నట్లే తెలుగులు వేడుకలో కూడా చేస్తారేమో చూడాలి. ఎన్నాళ్లగానో డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనీ ఆశపడుతున్న విజయ్ త్వరలోనే ఒక ద్విభాషా చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 30న రీలీజ్ చేయనున్నారు.