ఆడియో, ట్రైలర్ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్న ‘ఇంకొక్కడు’
Published on Aug 11, 2016 4:55 pm IST

inkokkadu
సౌత్ సినిమా పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామాగా చెప్పుకునే నటుడు ‘చియాన్ విక్రమ్’. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి చిత్రాలతో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన విక్రమ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఇంకొక్కడు’. ‘ఆనంద్ శంకర్’ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన ‘నయనతార, నిత్యామీనన్’ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తమిళంలో ఇరుముగన్’ గా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో ఆర్. కే ఫిలిమ్స్ ‘నీలం కృష్ణా రెడ్డి’ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర తమిళ ఆడియో, ట్రైలర్లు విడుదలై మంచి స్పందన తెచ్చుకోగా తెలుగు వర్షన్ ఆడియో, ట్రైలర్ ను జె.ఆర్‌.సి. క‌న్వెక్ష‌న్ సెంటర్లో ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ‘హరీశ్ జయరాజ్’ సంగీతాన్ని అందించారు.

 
Like us on Facebook