ఇంటెన్స్ పోస్టర్ లతో క్యూరియాసిటి పెంచుతున్న రామ్ “ది వారియర్”

Published on May 12, 2022 7:00 pm IST


రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహు బాషా చిత్రం ది వారియర్. ఈ చిత్రం లో రామ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై చిత్ర యూనిట్ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం టీజర్ ను మే 14, 2022 న సాయంత్రం 5:31 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. రామ్ పోతినేని మరియు ఈ చిత్రం లో విలన్ పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి లతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇంటెన్స్ పోస్టర్ సినిమా పై ఆసక్తి ను పెంచేస్తోంది. జూలై 14, 2022 న విడుదల కానున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :