“లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ పై పెరుగుతున్న ఆసక్తి.!

Published on Aug 18, 2021 8:00 am IST


ఎప్పుడు నుంచో కూడా మన టాలీవుడ్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రాల్లో లవ్ స్టోరీ కూడా ఒకటి. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య మరియు నాచురల్ బ్యూటీ సాయి పల్లవిలా కాంబోలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదలైన నాటి నుంచి కూడా చాలా మంచి బజ్ ను సంతరించుకుంది. అలా స్టార్ట్ అయిన నాటి నుంచి సినిమా పూర్తయ్యే వరకు కూడా మంచి అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం రిలీజ్ మాత్రం పరిస్థితులు రీత్యా వాయిదా పడుతూ వస్తుంది.

కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ రాబోతుంది అని తెలియగానే ఇండస్ట్రీ వర్గాలు సహా ఈ సినిమా కోసం ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియెన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పాటలు ప్రతిదీ కూడా పెద్ద హిట్ అయ్యింది. కమ్ముల టేకింగ్ కోసం కూడా అందరికీ తెలిసిందే..

అందుకే ఈ రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ పై అంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మరి దాని కోసం ఇంకొంతసేపు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం అందివ్వగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :