“భీమ్లా నాయక్” నుంచి కొత్త పాట ఇదేనా.?

Published on Nov 30, 2021 7:05 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి నిన్న రాత్రే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేసారు. ఇక ఇదిలా ఉండగా ఈ అప్డేట్ ని కొత్త పాటగా తెలుపగా ఇప్పుడు ఇదేంటా అని చర్చ మొదలైంది.

ఆల్రెడీ థమన్ సంగీతం బిగ్ ప్లస్ అయ్యింది ఈ సినిమాకి. ఇక ఇప్పుడు రాబోయే సాంగ్ పవన్ పాడిన పాటేనా లేదా వేరే సాంగ్ నా అనేది ఆసక్తిగా మారిన ప్రశ్న. టాక్ అయితే పవన్ పాడిందే అని వినిపిస్తోంది కానీ మరి అదేంటో తెలియాలి అంటే ఇంకొద్ది సేపు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :