“RRR” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో..!

“RRR” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో..!

Published on Oct 21, 2021 7:39 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రం షూట్ అంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి కూడా రెడీ అయ్యింది. అయితే ఇపుడు ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాల తాలూకా గ్రాఫికల్ పనులు ఈ చిత్రంలో జరుగుతున్నాయట. ఆల్రెడీ భారీ విజువల్ ఫీస్ట్ లా ఈ సినిమా ఉంటుంది అని టాక్ ఉంది. మరి ఇవి ఎలా ఉంటాయో ఇంకొన్నాళ్ళు ఆగి చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా భట్ సహా తదితరులు కీలక పాత్రల్లో నటించగా కీరవాణి గ్రాండియర్ సంగీతం అందివ్వగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు