నిఖిల్ “కార్తికేయ 2” కి ఇంట్రెస్టింగ్ విలువైన ప్రమోషన్స్.!

Published on Jul 31, 2022 11:01 am IST

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం “కార్తికేయ 2” కోసం అందరికీ తెలిసిందే. థ్రిల్లింగ్ సినిమాల్లో తనకంటూ ఒక మార్క్ ని సెట్ చేసుకున్న నిఖిల్ సిద్ధార్థ తన కెరీర్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైనటువంటి “కార్తికేయ” కి ఒక సాలిడ్ సీక్వెల్ తో ఇప్పుడు ముందుకొస్తున్నాడు. మరి ఈ చిత్రాన్ని చందూ మొండేటి దర్శకత్వం వహించగా మేకర్స్ అయితే మంచి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

మరి లేటెస్ట్ గా అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. తాము నాలుగు ముఖ్య నగరాల్లో నిజమైన బంగారు శ్రీకృష్ణ విగ్రహాలను దాచిపెడుతున్నామని వాటిని ఎవరైనా కనిపెట్టి చెప్పాలని తెలుపుతున్నారు. వీటికి క్లూ కూడా ఇస్తామని ఒకవేళ కనిపిడితే 6 లక్షల విలువైన ఆ బంగారు ప్రతిమ మీ సొంతం అని ఒక క్రేజీ ఆఫర్ ని అనౌన్స్ చేశారు. అలాగే ఫస్ట్ హింట్ ని కూడా మరికొన్ని గంటల్లో అందిస్తామని హీరో నిఖిల్ తెలిపాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :