సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శ్రీ మంతుడు'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జూన్ చివరి కల్లా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చెయ్యాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఇది కాకుండా మహేష్ బాబు ఇప్పటికే శ్రీ కాంత్ అడ్డాల చెప్పిన ‘బ్రహ్మోత్సవం’ స్టొరీ లైన్ ని ఖరారు చేసిన సంగతి ఇదివరకే తెలియజేశాం. తాజాగా మాకు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు తెలిసాయి.
శ్రీ కాంత అడ్డాల చెప్పిన స్టొరీ లైన్ నచ్చి మహేష్ బాబు బ్రహ్మోత్సవం కి ఓకే చెప్పాడు. తాజాగా శ్రీ కాంత్ అడ్డాల ఫుల్ స్క్రిప్ట్ ని ఫినిష్ చేసి మహేష్ బాబుకి వినిపించడం, మహేష్ బాబుకి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే మొదటి సారి మహేష్ బాబు కోసం శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా మొత్తం విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మే 31న కృష్ణ గారి బర్త్ డే కానుకగా ఈ సినిమాని లాంచ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. పివిపి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.
