చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ ఏ జానరో తెలుసా !

ఈ ఏడాది విన్న పెద్ద వార్తల్లో దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కలయికలో మల్టీ స్టారర్ చేయనుండటం. ఈ వార్త బయటికొచ్చినప్పటి నుండి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది సినిమా జానర్ ఏమిటి అనే ప్రశ్న. సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.

మరి ఇన్నాళ్లు యాంక్షన్, ఫాంటసీ జానర్లలో సినిమాలు తీసిన తాజు మొదటిసారి ఒక ఫ్యామిలీ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. పైగా ఈ కథ ఒక వాస్తవ కుటుంబం నుండి స్ఫూర్తి పొంది తయారుచేసుకుంటున్నారట. ఆ కుటుంబం ఎవరిదో తెలియాలన్నా ఇంకొన్నాళ్ళు ఎదురుచూడాల్సిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 వేసవికి మొదలుపెట్టి 2019 వేసవికి పూర్తిచేయాలనే ప్లాం లో ఉన్నారు జక్కన్న.