పేరేలేని పాత్రలో కనిపించనున్న కీర్తి సురేష్ !

పేరేలేని పాత్రలో కనిపించనున్న కీర్తి సురేష్ !

Published on Jan 1, 2018 3:24 PM IST

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ గేర్లో దూసుకెళుతున్న హీరోయిన్ కీర్తి సురేష్. నటనకు ఆస్కారమున్న పాత్రల్ని ఎక్కువగా ఎంచుకునే ఈమె ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరో సూర్య సరసన ‘తాన సెరెంద కూట్టం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఈమె ఒక సాంప్రదాయకమైన బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపించనుందట.

ఇందులో విశేషమేమిటంటే ఈమె పాత్రకు సినిమాలో అసలు ఖచ్చితమైన పేరే ఉండదట. అంతేగాక ఆమె పాత్రలో మంచి ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా తెలుస్తోంది. జనవరి 12న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకానున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పిస్తోంది. విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు