‘పవన్ కళ్యాణ్’ సినిమా కథ ఇలానే ఉండబోతోందట ?

pawan-kal
ప్రస్తుతం ‘పవన్ కళ్యాణ్, డాలీ’ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం యొక్క కథ అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో పవన్ ఓ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నాడట. పైగా ఏఈ చిత్రంలో పవన్ పాత్రకు ఓ లవ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట. ఈ కథలో పవన్ యువకుడిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ విఫలమై పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడట. అలా ఉన్న అతనికి మరో అమ్మాయి పరిచయమై పెళ్లి పట్ల అతనికున్న అభిప్రాయాన్ని మారుస్తుందట.

ఈ ట్రాక్ అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతూ మంచి ఫీల్ ను కలిగిస్తుందని, సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవముందో సినిమా విడుదలయ్యాక గానీ తెలీదు. ఇకపోతే తాజాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. త్వరలో పవన్ ఈ షూటింగ్ లో పాల్గొంటాడు. ప్రస్తుతం డాలీ ఇతర నటీనటుల మీద నడిచే ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ‘నార్త్ స్టార్’ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ‘శరత్ మారార్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘శృతి హాసన్’ హీరోయిన్ గా నటిస్తుంది.